ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు హీరో హీరోయిన్లు, నటీ నటులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారం క్రితం స్టార్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సైతం కరోనాకు ఎఫెక్ట్ అయ్యారు. ఈ వారం సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటూ కోవిడ్ చికిత్స తీసుకున్నారామే. వన్ వీక్ ట్రీట్మెంట్ పూర్తికావడంతో రకుల్ తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో ఆమెకు నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఆమె ఊపిరిపీల్చుకున్నారు.
ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ‘తాజాగా జరిపిన పరీక్షలో నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు. 2021 సంవత్సరాన్ని మంచి ఆరోగ్యంతోనూ, ఆశావాద దృక్పథంతోనూ ఆరంభిస్తాను . అందరూ బాధ్యతగా ఉండండి. మాస్కులు ధరించండి, అన్ని జాగ్రత్తలూ తీసుకోండి’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమాలో కథానాయకిగా నటించిన రకుల్ నితిన్, చంద్రశేఖర్ ఏలేటిల ‘చెక్’ చిత్రంతో పాటు హిందీ, తమిళ చిత్రాలకు సైన్ చేసింది.
Thankyou for all the love ❤️ pic.twitter.com/XwhHtMubKf
— Rakul Singh (@Rakulpreet) December 29, 2020