హీరోయిన్ రకుల్ ప్రీత్ కి తనపై వస్తున్న రూమర్స్ కి చిర్రెత్తుకొచ్చింది. దీనితో ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఓ తమిళ్ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రకుల్ ససేమిరా అంటున్న కారణంగా…ఆమెను ఆ చిత్రం నుండి తొలగించే ఆలోచనలో నిర్మతలు ఉన్నారని ఓ మీడియా ట్వీట్ చేయడం జరిగింది.
దీనితో రకుల్ ట్విట్టర్ లో ”బాధ్యత యుతమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది, మీడియా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది, కొన్ని హిట్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు. అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్ జరుపుతున్నారో నాకు చెప్పండి. ఇక్కడ పనిలేక చచ్చిపోతున్నాం” అని పోస్ట్ చేశారు. సదరు మీడియా చెప్పినదాంట్లో ఎటువంటి నిజం లేదని రకుల్ కొంచెం, గట్టిగానే చెప్పారు.
When will we have responsible journalism. When will media start checking facts . ???? stooping so low just for some extra hits ????♀️ plz tell me who is starting shoot and where @BOWorldwide cos I am dying to work ???? https://t.co/41YPxWAcYX
— Rakul Singh (@Rakulpreet) June 26, 2020