నడి సముద్రంలో డాల్ఫిన్లతో పోరాడుతున్న సూపర్ స్టార్

kochadiyan

సూపర్ స్టార్ రజినికాంత్ ఏది చేసినా ఒక వింతే.. సిగరెట్ ను గాలిలోకి విసిరి బుల్లెట్ తో షూట్ చేసి వెలిగించినా, చూయింగ్ గమ్ ను విలన్ తలమీదకు కొట్టి నోట్లో వేస్కున్నా అతి అతని స్టైల్ కు ప్రతీక. ఇప్పుడు అదే విధంగా మన రజిని నడి సముద్రంలో డాల్ఫిన్ ల తో ఒక ఫైట్ చేయ్యబోతున్నాడట. ఈ విషయం స్వయంగా తానూ నటిస్తున్న తదుపరి సినిమా ‘విక్రమసింహ’ దర్శకురాలు సౌందర్య తెలిపింది. “ఈ సినిమాలో చాలా పోరాట సన్నివేశాలు వుంటాయి. వాటిల్లో డాల్ఫిన్ల నడుమ చేసే ఫైట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే క్రూర మృగాల నడుమ కుడా విక్రమసింహుడు పోరాటాలు సాగిస్తాడని” తెలిపింది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ బాణీలను అందిస్తున్నారు. ఆడియో విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాలో రజిని సరసన దీపిక పదుకునె నటిస్తుంది.

Exit mobile version