ఇటీవలే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అన్నాత్తే షూట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చి తీవ్ర అస్వస్థతకు లోనయిన సంగతి తెలిసిందే. ఇక్కడే కొన్ని రోజుల చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉండగా అంతకు కొన్ని రోజుల ముందునే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తలైవర్ ఈ నెల 31న తమ పార్టీ ఆవిర్భావం ఉంటుంది అని ప్రకటన ఇచ్చారు.
దీంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేసారు. కానీ ఇంతలోనే ఇలా జరిగే సరికి తలైవా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నాని అలాగే ఈ నెల 31 న తమ పార్టీ అనౌన్సమెంట్ లేదని సంచనలన నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రజినీ అభిమానులకు ఇది కాస్త చేదు వార్తే అయినప్పటికీ తాను ముందు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధ్యం అయ్యేది. బహుశా ఆ కారణం చేతనే ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తప్పనిసరి అయ్యింది. ఇప్పటికే రజినీ తీసుకున్న ఈ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు మొదలు కూడా అయ్యిపోయాయి.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020