తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ కూతురు డైరెక్షన్లో ఆయన అల్లుడు నటించిన చిత్రం ‘3’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను తలక్రిందులు చేస్తూ బోల్తా కొట్టింది. ‘కొలవేరి’ పాట ఫీవర్ తో భారీ రేటుకు కొనుక్కున్న సదరు డిస్ట్రిబ్యూటర్లు రజిని కాంత్ గారిని సంప్రదించినట్లు సమాచారం. గతంలో రజిని కాంత్ నటించిన సినిమాలు భారీ ఫ్లోప్ అయితే ఆయన డిస్ట్రిబ్యూటర్లకి న్యాయం జరిగేలా చేసేవారు. అయితే ఈ 3 సినిమాతో తనకేమి సంభందం లేదంటూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు హక్కుల కోసం నట్టి కుమార్ కూడా భారీ రేటు పెట్టి కొనుగులు చేయగా ఆయనకు కూడా భారీ నష్టాలూ వచ్చాయి. దీంతో ఆయన కూడా సదరు సినిమా వారిపై కంప్లైంట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనప్పటికీ అన్ని తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకులు అంగీకరించరని మరోసారి రుజువైంది.