యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న మహా యాగం “రౌద్రం రణం రుధిరం”. ఎన్నో అంచనాలను నెలకొల్పుకున్న ఈ పీరియాడిక్ డ్రామా మళ్ళీ ఇప్పుడు షూటింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే కరోనా మూలాన ఈ చిత్రానికి ఎంత నష్టం జరిగిందో తెలిసిందే. దానికి తోడు దాని ఎఫెక్ట్ రాజమౌళి వరకు కూడా వెళ్లడంతో పరిస్థితులు మరింత స్థాయిలో ఊహించని విధంగా మారాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఓకే అనిపిస్తుండడంతో చిత్ర యూనిట్ మళ్ళీ షూట్ ను షురూ చెయ్యాలని భావిస్తున్నారు.
అయితే ఈ షూట్ విషయంలో జక్కన్న డెడ్ లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే దసరా తర్వాత సినిమా షూట్ మొదలు పెట్టి కేవలం నాలుగు నెలల లోపే సినిమాను పూర్తి చేసేయాలని రాజమౌళి ప్రణాళికలు వేస్తున్నారట. మరి త్వరగానే షూట్ పూర్తయినా విడుదల మాత్రం ఎప్పటికి ప్లాన్ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.