ప్రస్తుతం యావత్తు భారతదేశం మాత్రమే కాకుండా మాస్టర్ మైండ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్న వారు అందరికీ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న సినిమా వీరి కలయికలో రాబోతుంది.
అయితే ఈ సినిమా విషయంలో జాప్యం ఎక్కువ అవుతుంది అనుకుంటున్న ఫ్యాన్స్ కి మొదటి బాల్ నే సిక్సర్ కొట్టినట్టుగా రాజమౌళి మైండ్ బ్లాకింగ్ ప్లాన్ లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నవంబర్ లో గ్రాండ్ ఈవెంట్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ ని ఏకంగా లక్షమంది జన సందోహం నడుమ అత్యంత ఘనంగా చేయబోతున్నట్టు ఇప్పుడు వినిపిస్తోంది.
అంతమంది సమక్షంలో రాజమౌళి సినిమా తాలూకా మొదటి ప్రమోషనల్ కంటెంట్ ని అనౌన్స్ చేయనున్నారట. దీనితో ఈ భారీ ఈవెంట్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. ఇక గ్లోబ్ ట్రాటర్ మేనియా ఎలా ఉంటుందో ఆరోజు చూడాలి.


