బాహుబలి గురించి రాజమౌళి చెప్పిన విశేషాలు

SS-RAJAMOULI

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ రోజు తన ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో కాసేపు ముచ్చటించారు, అలాగే తన రాబోయే భారీ బడ్జెట్ ‘బాహుబలి’ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ జూలై 6 నుంచి హైదరాబాద్లో మొదలు కానుంది. పక్కాగా ఈగ రిలీజ్ అయిన ఒక సంవత్సరానికి ఈ సినిమా మొదలు కాబోతోంది.

ఈ సినిమాని అర్రి అలెక్సా ఎక్స్.టి లో షూట్ చేయనున్నారు. రాజమౌళి మొదటిసారిగా పూర్తి సినిమాని డిజిటల్ కెమెరాలతో తీస్తున్నారు. రాజమౌళి ఐ మాక్స్ కెమెరాలను వాడే ఐడియా నుంచి బయటకి వచ్చేసారు. అలాగే కేవలం మూడు రోజుల షూట్ కోసం 10 కోట్లు ఖర్చు పెడుతున్నాం అనే వార్తలు నిజం కాదని ఆయన కొట్టి పారేశారు.

ఈ సినిమాని అనేక భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అని అడిగితే ‘ ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం కానీ హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తాం. అలాగే ఈ సినిమాని మరికొన్ని ఫారిన్ లాంగ్వేజస్ లో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం, ఆ డీల్ సెట్ కాగానే వివరాలను తెలియజేస్తామని’ రాజమౌళి సమాధానం ఇచ్చాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. అనుష్క హీరోయిన్ గా నటించనుంది.

Exit mobile version