‘అందాలరాక్షసి’ హీరో రాహుల్ ఆ సినిమాలో నటన ద్వారా వరుస ఆఫర్లు వస్తున్నాయి. అందులో ఒకటి ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమా. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ముగించుకుని ఆడియో విడుదలైంది. ఇదిలావుంటే తన తరువాత సినిమా ‘హైదరాబాద్ లవ్ స్టొరీ’ షూటింగ్ లో బిజీగావున్నాడు. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ ముగిసింది. హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రేష్మి మీనన్ మరియు జియా హీరోయిన్స్.
ఈ సినిమా రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంటుంది. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా టాకీ పార్ట్ ను ముగించుకోనుంది