షూటింగ్ లో గాయపడ్డ రాఘవ లారెన్స్

raghava-lawrence

డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ప్రారంభించి తరువాత దర్శకుడిగా మారిన లారెన్స్ ప్రస్తుతం ‘ముని 3’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే ఈరోజు షూటింగ్ సమయంలో అనుకోకుండా గాయపడ్డాడు. ‘ముని 3’లో ఒక పాటకు రిహార్సేల్ చేస్తూ గాయపడ్డాడు. అనుకోకుండా జారిపడ్డ అతనికి మెడ మరియు చేతులకు గాయాలయ్యాయి. వెంటనే అతనిని చెన్నైలో రామ్ చంద్ర మెడికల్ సెంటర్ లో జాయిన్ చేసారు. డాక్టర్లు అతనిని 3నెలలు విశ్రాంతి తీసుకోమని కోరారు. ప్రస్తుతం ఫిజియోల సలహాలు ద్వారా త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకూ మొదటిభాగాన్ని చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఇంకా చాలా పోర్షన్ షూటింగ్ను పుర్తిచేయ్యాల్సివుంది. తాప్సీ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

Exit mobile version