‘రాధా’ నా సొంత స్టొరీ – మారుతి

‘రాధా’ నా సొంత స్టొరీ – మారుతి

Published on Feb 10, 2014 1:33 PM IST

director-maruthi

‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ తో ‘రాధా’ అనే సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. కొద్ది రోజులుగా ఈ సినిమా కథని సురేందర్ కృష్ణ అనే రచయిత రాసుకుందని, దాన్ని మారుతి కాపీ కొట్టాడని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే సురేందర్ కృష్ణ రైటర్స్ అసోషియేషన్ లో కంప్లైంట్ చేసాడు.

ఈ విషయంపై స్పందించిన మారుతి మాట్లాడుతూ ‘ ‘రాధా’ సినిమా కథ నేను సొంతగా రాసుకున్నది. నా దగ్గర బడ్జెట్ కి తగ్గట్టుగా అందరికి హీరోలకి సరిపడా కథలు ఉన్నాయి. కానీ రాధా కథని కొంతమంది నాదని అంటున్నారు. ఆ విషయాన్ని రైటర్స్ అసోషియేషన్ త్వరలోనే క్లారిఫై చేసి నా కథకి క్లీన్ చిట్ ఇస్తారు. రాధా సినిమా కోసం రాసిన 80 సీన్స్ లో ఒక్కటి కూడా కాపీ కాదని’ అన్నాడు. ప్రస్తుతం రైటర్స్ అసోషియేషన్ ఇదే పనిలో ఉన్నారు. త్వరలోనే ‘రాధా’ సినిమా స్టొరీ కాపీనా? కాదా? అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తాజా వార్తలు