రచ్చ ఆడియో విడుదల మళ్లీ వాయిదా పడిందా?

రచ్చ ఆడియో విడుదల మళ్లీ వాయిదా పడిందా?

Published on Feb 26, 2012 9:13 PM IST


రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘రచ్చ’ చిత్ర ఆడియో మార్చి 4న విడుదల కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కర్నూలులో జరగనున్న ఈ చిత్ర ఆడియో వేడుకను మార్చి 9 కి వాయిదా వేయాలని నిర్మాత భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు ప్రసాద్ జైన్ నిర్మిస్తున్నారు. తమన్నా హీరొయిన్ గా నటిస్తుండగా అజ్మల్, దేవ్ గిల్, పార్తిబన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రచ్చ చిత్రాన్ని మార్చి నెలాఖరుకు గని లేదా ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు