యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలోవుంది. ఈ సినిమా ప్రొడక్షన్ బృందం మూడు రోజుల పాటూ సాగే ఊటీ షెడ్యూల్లో బిజీగావుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఎన్.టి.ఆర్, సమంత హీరో, హీరోయిన్స్.
“మూడు రోజుల పాటూ సాగే షెడ్యూల్ కోసం ఊటీకి చేరుకున్నాం… ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది” అని దర్శకుడు ట్వీటిచ్చాడు.
షూటింగ్ నుండి చిన్న విరామంలో వున్న సమంత త్వరలో సినిమా బృందంలో తిరిగి చేరనుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఒక పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ గా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకులముందుకు రానుంది