స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీయనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ప్రొడక్షన్లో చాలా మార్పులు చేస్తున్నారని ఉదయమే తెలిపాము. ఈ సినిమా కోసం ఫిల్మ్ కెమెరాల స్థానంలో డిజిటల్ కెమెరాలను ఉపయోగించనున్నారు. అలాగే సినిమాటోగ్రాఫర్ శ్యాం కె. నాయుడు స్థానంలో అమోల్ రాథోడ్ ని తీసుకున్నారు. ప్రస్తుతం మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా టెక్నికల్ టీంలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి స్థానంలో రవీందర్ ని తీసుకున్నారు మరియు థాయిలాండ్ కి సంబందించిన కిచే ని స్టంట్ మాస్టర్ గా తీసుకున్నారు. పూరి జగన్నాథ్ కో ప్రొడ్యూసర్ ని కూడా మార్చారు ఆ స్థానంలో తరణి అనే వ్యక్తిని తీసుకున్నారు.
పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా ‘ఇద్దరమ్మాయిలతో’ స్క్రిప్ట్ ని మరింత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇన్ని మార్పులు జరగడం చూస్తుంటే పూరి నుంచి కొత్త రకమైన సినిమా రాబోతోందని ఆశించవచ్చు.