మొండోడుకు పూరి ‘స్వరం’

మొండోడుకు పూరి ‘స్వరం’

Published on Sep 2, 2013 5:00 PM IST

Puri-dubs-for-Mondodu-(4)
హీరో శ్రీకాంత్ కధానాయకునిగా రూపొందుతున్న చిత్రం మొండోడు. జర్నలిస్ట్ ప్రభు దర్సకత్వం వహిస్తున్నారు. రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల మూడవ వారంలో విడుదలకు సిద్ద మవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..’ ఒక మంచి కథా చిత్రంగా ఈ మొండోడు ఉంటుందని అన్నారు. హీరో శ్రీకాంత్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటూ ఆసక్తిని కలిగిస్తుందని అన్నారు. పూరీ జగన్నాధ్ గారు వాయిస్ ఓవర్ అందించటం పట్ల తన సంతోషాన్ని, కృతజ్ఞతను తెలిపారు’ నిర్మాత.

దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ పాత్ర పరిచయ దృశ్యాలకు, అలాగే చిత్రం ముగింపు సందర్భంలోనూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ స్వరాన్ని అందించారు. చిత్రానికి సంభందించిన కీలక దృశ్యాలలో ఆయన స్వరం వినిపిస్తుంది. ఆయనకు ప్రత్యేక కృతఙ్ఞతలు’ అన్నారు.

తాజా వార్తలు