నిఖిల్ కార్తికేయ 2 బడ్జెట్ ఎంతంటే?

నిఖిల్ కార్తికేయ 2 బడ్జెట్ ఎంతంటే?

Published on Feb 8, 2020 8:44 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఇటీవలే తన లేడీ లవ్ డాక్టర్ పల్లవి వర్మతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇక గత ఏడాది అర్జున్ సురవరం సినిమాతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. చాలా కాలంగా విజయాలు లేక సతమతమవుతున్న నిఖిల్ కి అర్జున్ సురవరం మూవీ ఉపశమనం కలిగించింది. లావణ్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించగా, ఎడ్యుకేషన్ మాఫియా ప్రధానంగా సినిమా తెరకెక్కింది.

కాగా నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన చిత్రం కార్తికేయ. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక దీనికి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే ఈ చిత్రం కోసం దాదాపు 13కోట్ల బడ్జెట్ కేటాయించారట. సోసియో ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ మూవీలో అద్భుత గ్రాఫిక్ విజువల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరినీ ప్రకటించలేదు.

తాజా వార్తలు