SSMB29 బిగ్ అప్డేట్.. ‘మందాకిని’గా ప్రియాంక పవర్‌ఫుల్ లుక్ రిలీజ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి నవంబర్ 15న బిగ్ అప్డేట్ ఉండబోతుందని మేకర్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో ఎవరి ఊహలకు అందకుండా జక్కన్న తనదైన స్ట్రాటెజీతో ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాడు.

ఇప్పటికే కుంభ అనే పాత్రలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను రిలీజ్ చేసిన SSMB29 యూనిట్, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. చీరకట్టులో చేతిలో తుపాకీ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తోన్న ‘మందాకిని’గా ప్రియాంక పాత్ర ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.

అసలు రాజమౌళి SSMB29లో ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడా.. వాటి కోసం ఆయన ఎంచుకున్న పాత్రలు ఏమిటా అనేది ఎవరి ఊహలకు అందకుండా ఉంటోంది. ఇక ఈ సినిమా నుంచి ఇలా వరుస అప్డేట్స్ వస్తుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version