తన చిత్రాన్ని స్నేహితురాలికి అంకితం ఇచ్చిన ప్రియా ఆనంద్

తన చిత్రాన్ని స్నేహితురాలికి అంకితం ఇచ్చిన ప్రియా ఆనంద్

Published on Jul 28, 2012 12:04 PM IST


ప్రియ ఆనంద్ తన రాబోతున్న చిత్రాలలో ఒకటి అయిన “కో అంటే కోటి” షోలాపూర్ బస్ ప్రమాదంలో గతించిన తన స్నేహితురాలికి అంకితం ఇచ్చారు. ఒకానొక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రియా “కో అంటే కోటి” చిత్రంలో తన పాత్ర చాల బాగుంటుంది అని ఆ పాత్ర బస్ ప్రమాదంలో గతించిన తన మిత్రురాలు సాహిత్యకి దగ్గరగా ఉందని అన్నారు. సాహిత్యని ప్రియా ట్విట్టర్లో కలుసుకున్నారు ” ఉద్యోగంలో చేరకముందు తను శిరిడి వెళ్ళాలని అనుకుంది. కాని తను వెళ్తున్న బస్ ప్రమాదంలో తను మరణించింది నేను ఎప్పుడు అంతలా ఏడవలేదు, నేను కలిసిన అమ్మాయిలలో తనలా ఎవ్వరు లేరు తను నా అభిమాని మాత్రమే కాదు స్నేహితురాలు కూడా” అని ప్రియా ఆనంద్ అన్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రలో కనిపిస్తుండగా ఈ చిత్రానికి అనీష్ కురువిల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా ప్రియా హిందీలో చెయ్యబోతున్న “నాడోడిగల్” రీమేక్ లో కనిపించనున్నారు ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించనున్నారు. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

తాజా వార్తలు