ట్రైలర్ టాక్ : ఫన్ రోలర్ కోస్టర్‌గా ‘ప్రేమంటే’

ట్రైలర్ టాక్ : ఫన్ రోలర్ కోస్టర్‌గా ‘ప్రేమంటే’

Published on Nov 17, 2025 6:56 PM IST

ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ప్రేమంటే’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఫన్ రోలర్ కోస్టర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీ, ఫన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే విధంగా ఉంది. పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య వచ్చే మనస్పర్థలను కామెడీ టచ్‌తో చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో బోలెడంతమంది ఆర్టిస్టులు ఉండటంతో ఎంటర్‌టైనింగ్‌కు ఎలాంటి ఢోకా లేదని స్పష్టమువుతోంది.

వెన్నెల కిషోర్, సుమ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు