చార్మినార్ గ్యాంగ్ స్టర్ పేరుతో ప్రవీణ్ శ్రీ నూతన చిత్రం

praveen-kalicharan

“గాయం-2” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రవీణ్ శ్రీ “చార్మినార్ గ్యాంగ్ స్టర్” అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్రం మద్దెలచెరువు సూరి జీవితం ఆధారంగా రాసుకున్న కథ అని తెలిపారు.చాలా కాలం పాటు సూరి, పరిటాల రవి శత్రువు గా న్యూస్ లో ఉండేవారు పరిటాల రవి మృతి తరువాత రామ్ గోపాల్ వర్మ “రక్త చరిత్ర” చిత్రంతో తిరిగి న్యూస్ లో కి వచ్చారు. “రక్త చరిత్ర-2” విడుదల అయిన కొద్ది వారాలకే అయన హైదరాబాద్ లో హత్య చెయ్యబడ్డారు. ఈ చిత్రం కోసం ప్రవీణ్ శ్రీ నూతన నటీనటులను ఎంచుకొంటున్నారు. మార్చ్ ద్వితీయార్ధంలో ఈ చిత్ర చిత్రీకరణ మొదలుపెట్టుకోనుంది. నందన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ శ్రీ అయన రెండవ చిత్రం “కాళీ చరణ్” చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు ఈ చిత్రం త్వరలో విడుదల అవ్వనుంది.

Exit mobile version