
మొదటి సినిమాకి జరిగిన పొరపాట్లు రెండవ సినిమాకి జరగకుండా జాగ్రత్త పడ్డాడు ప్రవీణ్ సత్తారు. మొదటి సినిమా ఎల్బీడబ్లూ మేకింగ్, ప్రమోషన్, విడుదల విషయంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకున్న ప్రవీణ్ తన రెండవ సినిమా రొటీన్ లవ్ స్టొరీ విషయంలో మళ్లీ జరగకుండా చూసుకున్నాడు. సందీప్, రేజీన హీరో హీరోయిన్లుగా నటించిన రొటీన్ లవ్ స్టొరీ గత వారం విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటుంది. ఈ సినిమాని మొదట నైజాం ఏరియాలో 104 థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. ఢమరుకం కూడా విడుదల కావడంతో 84 థియేటర్లలో విడుదల చేసారు. మంచి టాక్ రావడంతో మరో 10 థియేటర్లు పెంచారు. సినిమా విడుదలకి మూడు వారాల ముందు నుండే ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో సినిమాకి బాగా హెల్ప్ అయింది.