ప్రభాస్ “సలార్” కు ఒకేలా దింపేస్తున్న నీల్.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేపట్టిన సాలిడ్ లైనప్ లో “కేజీయఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ జనవరిలోనే మొదలు కానుంది. మరి ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మరి అందులో భాగంగానే నీల్ ఈ చిత్రానికి తన కేజీయఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ను తీసుకోనున్నారని టాక్ వచ్చింది.

మరి ఇప్పుడు ఇదే బాటలో అదే సినిమాకు మరో సాలిడ్ టెక్నిషియన్ కూడా తీసుకుంటారని మరో టాక్ వినిపిస్తుంది. అదే కేజీయఫ్ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ ఇచ్చిన రవి బాసృర్ నే “సలార్” కూడా తీసుకుంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ నీల్ మాత్రం ఈ సినిమాకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని ఒకవేళ అతన్నే తీసుకున్నా ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆహ్వానిస్తారు. మరి ఏం జరగనుందో కాలమే డిసైడ్ చెయ్యాలి.

Exit mobile version