ఈమధ్య బాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ బాగా బిజీగా కనిపిస్తున్నాడు. అజయ్ దేవగన్ నటించిన ‘సింగం’ సినిమా విడుదలైననాటి నుండీ ప్రకాష్ రాజ్ కు పలు భారీ సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చెయ్యమని అడుగుతున్నారు. ఈ విలక్షణ నటుడు త్వరలో అపూర్వ లిఖియా తీసిన ‘జంజీర్’ లో విలన్ రోల్ చేసాడు. అంతేకాక ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సినిమాలో బ్యాంకాక్ లో జరుపుకుంటున్న షూటింగ్ లో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో భారీ విజయం సాధించిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ సినిమానుండి స్పూర్తిపొందింది. ఇందులో స్నేహ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తుంది. ఇదేకాక ప్రకాష్ రాజ్ గుణశేఖర్ తీస్తున్న ‘రుద్రమదేవి 3డి’ లో రుద్రమదేవికి ప్రధానమంత్రిగా నటిస్తున్నాడు.