ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ మూవీ లేనట్టేనా.. ఆ రికార్డు కూడా మిస్ అయినట్టే..!

lik

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా వంద కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇక ఇప్పుడు ఈ హీరో తన నెక్స్ట్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(LIK) చిత్రాన్ని డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు ప్రదీప్ సిద్ధమవుతున్నాడు.

దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ చిత్రం ఇప్పుడు రిలీజ్ వాయిదా వేసుకుంటున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులే ఉన్నా, ఈ చిత్ర ప్రమోషన్స్ అంతంత మాత్రంగా చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. ఇక తెలుగులో అయితే, ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషన్స్ జరగడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న రిలీజ్ చేసే ఛాన్స్ తక్కువగా ఉన్నాయని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు.

అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, యోగి బాబు, గౌరి జి కిషన్, మిస్కిన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతంం అందిస్తున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందేనట.

Exit mobile version