బాలీవుడ్లో తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సూపర్ హిట్, ఆ తర్వాత చేసిన సినిమా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా ఇంకెవరు మన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో చేస్తున్న సినిమాకి తెలుగు టైటిల్ ని పెట్టాడు. సినిమా పేరు ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమా ప్రభుదేవా డైరెక్టర్ గా పరిచయమవుతూ సిద్దార్థ్ – త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకి రీమేక్. నిర్మాత కుమార్ తౌరని కొడుకు గిరీష్ కుమార్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. తెలుగులో త్రిష పోషించిన పాత్రలో సౌత్ ఇండియన్ అందాల భామ శ్రుతి హాసన్ కనిపించనుంది. ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా 2013 జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.