ఆంధ్రప్రదేశ్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ గోదావరి జిల్లాలో ప్రభాస్ కి ఎక్కువ ఫాన్స్. భీమవరంలో ప్రతి ప్రభాస్ సినిమా రిలీజ్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భీమవరంలో 70 అడుగుల కటౌట్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్లో బాగా ఫేమస్ అయిన ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ ని కూడా ఈ కటౌట్ పై రాసారు. అనుష్క – రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ప్రమోద్ – వంశీ సంయుక్తంగా నిర్మించారు.