ప్రభాస్ దర్శకుల జాబితాలో అతనున్నాడు

ప్రభాస్ దర్శకుల జాబితాలో అతనున్నాడు

Published on Feb 12, 2020 6:40 PM IST

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాతి చిత్రం గురించి ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ కొన్నాళ్లుగా ఆయన ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో కలిసి వర్క్ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదంటూ ఇంకొన్ని వార్తలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ జాబితాలో సందీప్ వంగ ఉన్న మాట వాస్తవమేనట.

సందీప్ ప్రభాస్ కు ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది ప్రభాస్ గత చిత్రాలకు భిన్నంగా, ఇదివరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ మూవీ అనే టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ గత చిత్రాలు ‘బాహుబలి 2, సాహో’లకు మించిన బడ్జెట్ అవసరమవుతుందట. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తికాగానే ప్రభాస్, సందీప్ ఈ సినిమా విషయమై తుది నిర్ణయం తీసుకునే వీలుంది.

తాజా వార్తలు