దుల్కర్ ‘కాంత’ ట్రైలర్ కోసం ప్రభాస్..!

Prabhas To Launch Dulquer Salmaan's Kaantha

తనదైన మూవీ సెలెక్షన్, పర్ఫార్మెన్స్‌తో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇతర ఇండస్ట్రీల్లో సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఆయన నేరుగా టాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా చిత్రం ‘కాంత’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాను నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌కు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్ర ట్రైలర్‌ను అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ డిజిటల్‌గా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 6న ఉదయం 11 గంటలకు ప్రభాస్ ‘కాంత’ ట్రైలర్ డిజిటల్ లాంచ్ చేయనున్నారు.

దీంతో ఒక్కసారిగా ‘కాంత’ ట్రైలర్ పై ఫోకస్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సముధ్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో స్పిరిట్ మీడియాపై రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Exit mobile version