‘కన్నప్ప’కి ప్రభాస్ స్టార్ పవర్ కలిసొచ్చిందిగా.. ప్రమోషన్స్ కూడా చేసుంటే

మంచు వారు డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా యదార్ధ గాథ ఆధారంగా దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కన్నప్ప”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా హిస్టారికల్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది దిగ్గజ నటీనటులు భాగం అయ్యారు. అయితే ఈ అందరిలో కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాక్టర్ మాత్రం ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి.

ప్రస్తుతం సినిమా మంచి బుకింగ్స్ బుక్ మై షోలో చూస్తుంది అంటే అందులో సింహభాగం ప్రభాస్ కి కూడా చెందుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం తన ప్రెజెన్స్ కే ఇలా ఉంటే… తాను నేరుగా ప్రమోషన్స్ లోకి దిగి ఉంటే ఇంకా బెటర్ గా కన్నప్ప బుకింగ్స్ ఉండేవి అని చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి స్టీఫెన్ డేవస్సి సంగీతం అందించగా మంచు మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాణం వహించారు.

Exit mobile version