ప్రభాస్ ని రాజుగా మొత్తం 5 కథలు.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఆఖరికి

prabhas

తెలుగు సినిమా దగ్గర ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో రాజులు, రాజుల కాలం నాటి సినిమాలు లాంటివి చేయాలి అంటే అందులో మొదటిగా వినిపించే హీరో పేరు ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిన్ గా బాహుబలి సినిమాలతో ఇండియన్ సినిమాకి ఒక ‘రాజు’ దొరికాడు అని చాలా మంది భావించారు.

నిజానికి అభిమానులు, దర్శకులు కూడా ప్రభాస్ కి అలాంటి స్థానాన్నే అందిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ప్రభాస్ తో బాహుబలి లాంటి సినిమా చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళినే మొత్తం 5 సినిమాలు కేవలం రాజుల నేపథ్యంలోనే తీసుకొచ్చినట్టు ప్రభాస్ లేటెస్ట్ జపాన్ మీట్ లో తెలిపాడు.

అంతే కాకుండా ఆ 5 సబ్జెక్టు లలో ఒకటే బాహుబలిగా ఫైనల్ చేసినట్టు వెల్లడి చేసాడు. సో ఇలా జక్కన్న మాస్టర్ ప్లాన్ ఆఖరికి బాహుబలి గా రూపం దాల్చుకొని ఇండియన్ సినిమా దగ్గర చిరస్థాయిగా నిలిచిపోయింది.

Exit mobile version