ఖరారైన పాండవులు పాండవులు తుమ్మెద రిలీజ్ డేట్

Pandavulu-Pandavulu-Thummed
మంచు ఫ్యామిలీ హీరోలైన డా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మోహన్ బాబు ఖరారు చేసారు. ‘పాండవులు పాండవులు తుమ్మెద సినిమాని జనవరి 31న విడుదల చేస్తున్నాం. అలాగే జనవరి 1న ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామని’ ట్విట్టర్ ద్వారా మోహన్ బాబు తెలియజేశారు.

ఈ సినిమాలో మంచు హీరోలతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ లు కుడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీ వాస్ డైరెక్టర్. సరే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి, మణిశర్మ, బప్పి లహరి, బాబా సెహగల్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version