మంచు మనోజ్ ‘పోటుగాడు’ రిలీజ్ డేట్

మంచు మనోజ్ ‘పోటుగాడు’ రిలీజ్ డేట్

Published on Sep 1, 2013 1:30 PM IST

Potugadu
మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమా ‘పోటుగాడు’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఇటీవలే విడుదల చేసారు. అచ్చు సంగీతం అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ‘పోటుగాడు’కి పవన్ వడేయార్ డైరెక్టర్. ఈ మూవీలో మంచు మనోజ్ సరసన సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ గోయెంక, రేచల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష లగడపాటి నిర్మిస్తున్న ఈ సినిమా విజయంపై మంచు మనోజ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

తాజా వార్తలు