ప్రముఖ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ గేయ రచయితల్లో వెన్నెలకంటి ప్రముఖ స్థానం ఉంది. స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన ఆయన నాటకాల నుండి సినిమా రంగంలోకి ప్రవేశించారు. 1989లో వచ్చిన ‘శ్రీరామచంద్రుడు’ చిత్రంతో గేయ రచయితగా మారిన ఆయన ఆ తర్వాత వందల సినిమాలకు పాటలు రాశారు.

‘స్వాతికిరణం, ఆదిత్య 369, అల్లరి ప్రియుడు, భైరవ ద్వీపం, ముగ్గురు మొనగాళ్లు, మహర్షి, ఏప్రిల్ 1 విడుదల, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అన్నయ్య, శీను, టక్కరి దొంగ, ఆవారా’ లాంటి అనేక హిట్ సినిమాలకు సూపర్ హిట్ పాటలను అందించారు ఆయన. దాదాపు ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలందరికీ పాటలు రాసిన ఘనత ఆయనది. పాటలే కాదు తెలుగు అనువాద చిత్రాలకు మాటలు కూడ రాసేవారు ఆయన. ముఖ్యంగా తమిళం నుండి తెలుగులోకి అనువదించబడే సినిమాలకు మాటలు రాయాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన కుమారుడు శశాంక్ వెన్నెల కంటి తెలుగు అనువాద చిత్రాలకు పనిచేస్తున్నారు.

Exit mobile version