తెలుగూ, తమిళ్ లో అదరగొడుతున్న పూజా హెగ్డే సాంగ్

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అమీర్ ఖాన్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే “కూలీ”. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఈ సాంగ్ ని తెలుగు, తమిళ్ సహా హిందీలో కూడా విడుదల చేశారు.

నిన్న వచ్చిన ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా తమిళ్ లో భారీ వ్యూస్ అందుకుంటే ఇంట్రెస్టింగ్ గా తెలుగులో యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ మోనికా సాంగ్ లో హైలైట్ గా పూజా హెగ్డే సౌబిన్ సాహిర్ లు నిలవగా వీరి ఎఫెక్ట్ తో మరింత రీచ్ ఈ సాంగ్ కి కొనసాగుతుంది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఆగస్ట్ 14న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version