జంషెధ్ పూర్ లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’

జంషెధ్ పూర్ లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’

Published on Feb 12, 2014 1:00 AM IST

image0013
సాయి ధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్న ‘పిల్లా నువ్వు లేని జీవితం’ శరవేగంగా సాగుతుంది. రవి కుమార్ చౌదరి దర్శకుడు. బన్నీ వ్యాస్, హర్షీత్ లే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడు

ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిత్రబృందమంతా ఈ సినిమాలో ఆయన పాత్రను ప్రశంసిస్తున్నారు. .చాలా భాగం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఫిబ్రవరి 17నుండి ఈ చిత్రబృందం జంషెధ్ పూర్, జార్ఖాండ్ లలో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న ప్రధానతారాగనమంతా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు

అనూప్ రుబెన్స్ సంగీతదర్శకుడు. దాశరధి సీవేంద్ర సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఈ యేడాది చివర్లో విడుదలకానుంది

తాజా వార్తలు