ఫోటో మూమెంట్: ‘పుష్ప 2’ కి ఏడాది.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ!

Pushpa2
టోటల్ ఇండియన్ సినిమా దగ్గర ఒక సెన్సేషనల్ హిట్ సినిమా ఏది అంటే అంతా బాహుబలి అని అంటారు కానీ దానికి మించిన హిట్ గా భారీ వసూళ్లు సాధించిన చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప. దీని నుంచి వచ్చిన పార్ట్ 2 రికార్డులు తిరగేసి ఇండియన్ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సెట్ చేసింది.

ఇలా మొత్తానికి నేడు డిసెంబర్ 5తో ఏడాది కంప్లీట్ చేసుకుంది. మరి ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేసి అంతే స్పెషల్ పోస్ట్ తో వచ్చాడు. పుష్ప 2 క్లైమాక్స్ పోర్షన్ లో దర్శకుడు సుకుమార్ తో డిస్కస్ చేస్తున్న పిక్ ని తాను పంచుకొని పుష్ప చిత్రం కోసం ఐదేళ్లు తన శ్రమ అలానే మొత్తం సినిమా యూనిట్ తో ప్రయాణం ఎప్పటికి మర్చిపోలేనిది అని పుష్ప 2 సెన్సేషనల్ సక్సెస్ తో పంచుకున్నాడు.

అలాగే అంతకు మించిన ప్రేమని అందించిన ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఈ స్పెషల్ డేకి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. దీనితో ఈ పోస్ట్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

Exit mobile version