ఇండియన్ సినిమా ప్రైడ్ నటుల్లో డెఫినెట్ గా ఉండే పేర్లలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. తన నుంచి ఎన్నెన్నో ఐకానిక్ పాత్రలు వచ్చాయి. మరి ఇండియన్ సినిమాకి తమిళ సినిమాకి తాను అందించిన అపారమైన సేవతో ఇటీవల రాజ్యసభలో స్థానం కూడా దక్కింది.
మరి లేటెస్ట్ గా కమల్ హాసన్ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి కనిపించిన పిక్స్ వైరల్ గా మారాయి. మోడీతో కలిసి కరచాలనం చేస్తూ, ఏదో డిస్కస్ చేస్తున్న పిక్స్ ని కమల్ షేర్ చేసుకోవడం ఇపుడు వైరల్ గా మారింది. అయితే ఈ మీటింగ్ పై కమల్ హాసన్ అసలు కారణం వెల్లడించారు. తమిళనాడు ప్రజల ప్రతినిధిగా మరియు కళాకారుడిగా, కొన్ని అభ్యర్థనలను ఉంచాను, వాటిలో ప్రధానమైనది ‘కీలడి’ ప్రాచీనతను గుర్తించి, వేగవంతం చేయాలనే పిలుపు కోరినట్టు తెలిపారు.
అలాగే తమిళ నాగరికత యొక్క గొప్పతనాన్ని మరియు తమిళ భాష తాలూకా వైభవాన్ని ప్రపంచానికి ప్రదర్శించడంలో తమిళ ప్రజలకు తన మద్దతును అందించాలని నేను ప్రధానమంత్రిని కోరాను.” అని తెలిపారు. దీనితో కమల్ కీలక కలయిక వైరల్ గా మారింది.