విప్లవత్మకమయిన చిత్రాలను చెయ్యటంలో ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు ఒకడుగు ముందు ఉంటారు. ఇలా అయన చేసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయన తాజాగా “పీపుల్స్ వార్” అనే చిత్రంతో ప్రజల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గదర్ విచ్చేశారు. అయన మాట్లాడుతూ “ఆర్ నారాయణమూర్తి చిత్రాలు కాహ్రిత్రలో నిలిచిపోతాయి అన్ని వ్యాపారంగా చూస్తున్న ఇలాంటి కాలంలో కూడా ప్రజల కోసం ఒక చిత్రం చేస్తున్నారంటే అది ఆర్ నారాయణమూర్తి గొప్పతనం అనే చెప్పుకోవాలి” అని అన్నారు. సోంపేట అల్లర్లను ప్రధానంశంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం తన కెరీర్ లో విభిన్నమయిన చిత్రం అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు. ఈ చిత్రంలో శ్రీ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయమయి ఈ చిత్రంలో నటించడం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని శ్రీహరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గోరేటి వెంకన్న, పోసాని కృష్ణ మురళి, వందేమాతరం శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.