పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో జరుగుతోంది. ఈ టీం యూరోప్ లో షూటింగ్ ముగించుకొని ఈ నెల 30న తిరిగిరానుంది. ఇప్పటికే సమంత హైదరాబాద్ కు వచ్చింది. యూరోప్ లో ఈ టీం మూడు పాటలను షూట్ చేశారు(ఒకటి పవన్ కళ్యాణ్ పై, మరొకటి పవన్ – సమంతపై, ఇంకొకటి పవన్ – ప్రణీత లపై). అలాగే కొన్ని సన్నివేశాలను కూడా అక్కడ చిత్రీకరించారు.
పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్స్ ని కూడా యూరోప్ లో చిత్రీకరించారు. ఈ సినిమాని ఆగష్టులో విడుదలచేయడానికి ఈ సినిమా బృందం చాలా వేగంగా పని చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ డైలాగులతో, ఆనందబరితమైన ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం.