హైదరాబాద్ చేరిన పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ టీం

Pawan-Kalyan1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రొడక్షన్ టీం సక్సెస్ఫుల్ గా యూరప్ లో ఓ కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. మాకు అందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఈ చిత్ర టీం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. యూరప్ లో మూడు పాటలను, కొంత టాకీ పార్ట్ ని షూట్ చేసారు. ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీస్తం అందిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version