ఆగష్టులో విడుదలకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా

Pawan-Kalyan1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరోప్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ సినిమాని ఆగష్టు మొదటివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయంలోగా ఈ సినిమా షూటింగ్ పూర్తీ అవుతుందని ఈ సినిమా టీం అంటున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ సినిమా స్టైల్ లో ఈ సినిమాలో కూడా కామెడీ ఎక్కువగా ఉండవచ్చునని బావిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ‘జల్సా’ తరువాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version