నైజాంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన పవన్

attarintiki-daredi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నైజాం ఏరియాలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. నిన్నటి సాయంత్రానికి అనగా 5వ రోజు ముగిసే సమయానికి 10.55 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ రోజు పబ్లిక్ హాలిడే కావడం వల్ల కలెక్షన్స్ బాగా స్ట్రాంగ్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి వారం మొత్తానికి 13 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏరియాలో ఇది ఆల్ టైం రికార్డు.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రణిత ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మొత్తంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైం అత్యధిక కలెక్షన్స్ సాదించిన సినిమాల లిస్టులో చేరుతుందని ఆశిస్తున్నారు.

Exit mobile version