ఏ హీరోకి అయినా సరే తన రేంజ్ కి తగ్గ సినిమా పడితే ఎలా ఉంటుందో ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి “ఓజి” సినిమా నిలిచింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ అంచనాలు దీనికి ఉన్నాయి. ఇక ఇందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి ఊహించని రేంజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇలా తెలుగు స్టేట్స్ కి ఒక్క ఆంధ్రాలో సీడెడ్ కాకుండా 80 కోట్లకి పైగా మేకర్స్ విక్రయించినట్టుగా టాక్ వినిపిస్తుంది.
దీనితో అసలు ఓజి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సీడెడ్ లో కూడా బిజినెస్ క్లోజ్ కావాల్సి ఉంది. అక్కడ ఏ రేంజ్ బిజినెస్ ఈ సినిమాకి జరుగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.