సెప్టెంబర్ పై కన్నేసిన పవన్ ??

AD
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అత్తారింటికి దారేది’ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను చాలా రోజుల క్రితం ముగించుకుంది. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు అందుకున్న ఈ సినిమాకు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. కానీ రాష్ట్ర రాజకీయ నేపధ్యాల నడుమ ఈ సినిమా వాయిదాపడుతూ వస్తుంది

ఈ వాయిదా కారణంగా పలు పంపిణీదారులు అప్పుగా తీసుకున్న వాటికి వడ్డీ రేట్లు పెరిగి ఎటూ తోచలేని స్థితికి చేరుకున్నారు. ఈ జాబితాలో నిర్మాత కూడా వున్నారు. ఈ అవాంతరాలకు ఆనకట్ట వెయ్యాలనే ఆలోచనతో పవన్ కళ్యాన్ ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చెయ్యాలని భావిస్తున్నారు

సెప్టెంబర్ మూడు లేదా నాలుగో వారంలో ఈ సినిమా విడుదలకు మంచిదని బృందం యోచిస్తుంది. సమంత హీరోయిన్. దేవి మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు

Exit mobile version