రచ్చ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సంపత్ నంది పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కి కథ వినిపించగా పవన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అవినీతి పై పోరాడే హీరో పాత్రలో పవన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తన స్నేహితుడు శరత్ మరార్ తో కలిసి పవన్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇష్టమైన సంగీత దర్శకుడిగా రమణ గోగుల ఈ సినిమా ద్వారా మళ్లీ ఆయనతో కలిసి పనిచేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం సినిమాలు వచ్చాయి. పవన్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తరువాత 2013లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియజేయనున్నారు.