జూలై 14న ‘అత్తారింటికి దారేది’ ఆడియో విడుదల?

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియోని జూలై 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వేడుకని హైదరాబాద్లో జరిపే అవకాశం ఉంది. దీనికోసం వేదికను కూడా సిద్దం చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటించగానే తెలియజేస్తాం. ఈ సినిమా టీం ప్రస్తుతం యూరోప్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి దేవీ శ్రీ అధ్బుతమైన సంగీతాన్ని అందించనున్నాడని తెలిసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version