‘అత్తారింటికి దారేది’కి డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Atharintiki-Dharedhi-(3)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసాడు. ఆయన ఎంతో జోష్ గా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు అలాగే సినిమా విషయంలో ఆయన చాలా హ్యాపీ గా ఉన్నాడు. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమా అనుకున్న డేట్ ఆగష్టు 7న రిలీజ్ అవుతుందని ప్రొడక్షన్ టీం మరోసారి తెలియజేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

సమంత, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో బొమన్ ఇరాని, నదియా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అత్తారింటికి దారేది ఫుల్ కామెడీగా ఉండే కుటుంబ కథా చిత్రమని అందరూ భావిస్తున్నారు.

Exit mobile version