ఇప్పుడున్న రోజుల్లో సోషల్ మీడియాకు ఎంత ప్రాధాన్యత పెరిగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా అలాగే మన తెలుగు టాప్ హీరోలు కూడా వాటిలో ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే మెగా హీరోస్ లో మాత్రం మెగాస్టార్ మరియు రామ్ చరణ్ లు ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి వచ్చారు.
చరణ్ కు అయితే పేస్ బుక్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఇటీవలే ఇన్స్టాగ్రమ్ మరియు ట్విట్టర్ లు చేసుకున్నాడు. మరి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వాడకం తక్కువే..ట్విట్టర్ నుంచి పేస్ బుక్ కు రావడానికి కూడా చాలానే సమయం తీసుకున్నారు.
మరి ఇప్పుడు అలాగే మరో అంతర్జాల యాప్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుగు పెట్టనున్నారు అంటూ అభిమానులే జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఈ జనవరిలోనే పవన్ తన ఇన్స్టా ఖాతా తెరుస్తారని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పవన్ నటించిన “వకీల్ సాబ్” టీజర్ కోసం వీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.