ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న పవన్ కళ్యాణ్

ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న పవన్ కళ్యాణ్

Published on Feb 17, 2014 2:00 PM IST

Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఇంకా మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఇంకా సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు. తాజాగా పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘ఓ మై గాడ్’ రీమేక్ లో నటించనున్నాడని ప్రకటించారు. దీంతో ‘గబ్బర్ సింగ్ 2’ ఆగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ విషయం పై ఈ చిత్ర ప్రొడక్షన్ టీం క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాల్లో నటించనున్నాడని తెలిపారు. అలాగే ‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కాస్త ఆలస్యమవుతోందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ ఒకే సమయంలో జరుగుతాయని దానికి తగ్గట్టు పవన్ డేట్స్ ఇచ్చారని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ గురించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు