పవన్ కళ్యాణ్ ‘పింక్’ లేటెస్ట్ అప్ డేట్ !

‘పింక్’ రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైన సంగతి ఫిల్మ్ సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుండి మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఒకింత క్కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒకవేళ పవన్ సినిమా చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడా… లేదా అనే అనుమానం కూడా వాళ్ళల్లో మొదలైంది. ఒకపక్క పవన్ రాజకీయపరమైన పనుల్లో పడి పూర్తిగా తన లుక్ మీద కంట్రోల్ తప్పారు. మరి ప్రజెంట్ లుక్ లో ఆయన సినిమా చేయడం దాదాపు కష్టమే. లుక్ మార్చుకుంటేనే ప్రేక్షకులకు పాత పవన్ కళ్యాణ్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన లుక్ ఛేంజ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. దీంతో అసలు పవన్ సినిమా చేస్తాడా లేదా ఒకవేళ చేస్తే ఇదే లుక్ తో చేస్తాడా, అలా చేస్తే ఆ సినిమా కష్టం కదా అనే అనుమానాలు ఆయన ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. మరి ఈ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ నుండి త్వరలో జవాబు ఎమైనా వస్తుందేమో చూడాలి. ఇక పింక్ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

Exit mobile version